News February 5, 2025
బెల్లంపల్లి: అనాథ యువకుడికి అంత్యక్రియలు

బెల్లంపల్లిలో ఓ అనాథ యువకుడికి గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు చేశారు. గ్రామానికి చెందిన కూలీ నరేశ్ బుధవారం రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడికి ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులంతా కలిసి డబ్బులు పోగు చేసి అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News March 7, 2026
సంగారెడ్డి: మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి: ఎస్పీ

మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఎస్పీ పారితోష్ పంకజ్ శనివారం తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. మహిళల భద్రత కోసం నిరంతరం భరోసా సెంటర్, షీ టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో 109, షీ టీం నంబర్ 87125 65672, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 56739 సంప్రదించాలని సూచించారు.
News March 7, 2026
జగిత్యాల: బావిలో బాలుడి మృతదేహం లభ్యం

సారంగపూర్ మండలంలోని రేచపల్లి గ్రామంలో పవన్ తేజ (10) శనివారం సాయంత్రం బావిలో శవమై కనిపించాడు. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్-జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ ఈనెల 3న హోలీ ఆడుకోవడానికి వెళ్లగా, సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. సాయంత్రం వేళ గ్రామ సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News March 7, 2026
WGL: నేటి నుంచి ‘హెచ్‌పీవీ’ టీకాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత టీకా(HPV) పంపిణీ జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. 15 ఏళ్లలోపు బాలికల కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ టీకా కోసం 9,824 మంది బాలికలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.


