News October 3, 2024

బెల్లంపల్లి: ‘ఆధారాలతో నిరూపిస్తే రూ.60 లక్షలు చెల్లిస్తా’

image

ఆరిజన్ డైరీ CAOబోడపాటి శేజల్ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రూ.30లక్షలు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఏసీపీ దగ్గర ఆధారాలతో సహా బయట పెడితే రూ.60లక్షలు చెల్లిస్తానని ఛాలెంజ్ విసిరారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Similar News

News November 1, 2024

బేల: దండారి ఉత్సవాల్లో మాజీ మంత్రి జోగు రామన్న

image

బేల మండలంలోని వాడగూడ, జంగుగూడ, మసాలా (బి), సదల్పూర్, మరిన్ని గ్రామాలలో ఏర్పాటు చేసిన దీపావళి దండారి ఉత్సవాల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. జోగు రామన్న మాట్లాడుతూ.. దండారీలకు రూ.10 వేల ఆర్థిక సాయం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనే ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు రామన్న పేర్కొన్నారు.

News November 1, 2024

నిర్మల్: పండగ పూట విషాదం.. ఇద్దరు మృతి

image

నిర్మల్ జిల్లాలో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా.. పట్టణంలోని YSR కాలనీకి చెందిన నరేశ్(25) తామర పువ్వుల కోసం చెరువుకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. కాగా, బంగల్పేట్ చెరువులో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు జోగుల సీతారాం మేస్త్రిగా గుర్తించారు.

News November 1, 2024

దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ ఎంపీ

image

ఆదిలాబాద్ పట్టణంలో గురువారం దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులు నిర్వహించిన లక్ష్మీ పూజలో ఎంపీ గొడం నగేశ్ పాల్గొన్నారు. ఈ మేరకు ఓ ట్రావెల్స్ కార్యాలయంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొని టపాసులు కాల్చారు. అనంతరం జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.