News April 12, 2025
బెల్లంపల్లి: ఇంట్లో గంజాయి పెంపకం.. వ్యక్తి అరెస్ట్: SHO

ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ SHO దేవయ్య తెలిపారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన దేవి రాహుల్కు గంజాయి తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోతన ఇంటి ఆవరణలో రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. మొక్కలను స్వాధీనం చేసుకొని రాహుల్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News October 22, 2025
నేడు కామారెడ్డిలో జాబ్ మేళా

కామారెడ్డిలోని కలెక్టరేట్లో ఫస్ట్ ఫ్లోర్లోని 21వ రూమ్లో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజని కిరణ్ తెలిపారు. ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9885453222 నంబర్కు సంప్రదించాలన్నారు.
News October 22, 2025
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ 16 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ( కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 10 పోస్టులకు అప్లైకి ఈ నెల 24 ఆఖరు తేదీ కాగా.. 6 పోస్టులకు ఈ నెల 28 లాస్ట్ డేట్. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://dic.gov.in/
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43

1. జనకుని తమ్ముడి పేరు ఏంటి?
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ఎవరు?
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం ఏది?
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ఏమిటి?
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ఏమంటారు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>