News April 12, 2025

బెల్లంపల్లి: ఇంట్లో గంజాయి పెంపకం.. వ్యక్తి అరెస్ట్: SHO

image

ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ SHO దేవయ్య తెలిపారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన దేవి రాహుల్‌కు గంజాయి తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోతన ఇంటి ఆవరణలో రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. మొక్కలను స్వాధీనం చేసుకొని రాహుల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News December 8, 2025

డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం

News December 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 8, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ సమీక్షించనున్నట్లు ఆదివారం వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.