News April 12, 2025

బెల్లంపల్లి: ఇంట్లో గంజాయి పెంపకం.. వ్యక్తి అరెస్ట్: SHO

image

ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ SHO దేవయ్య తెలిపారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన దేవి రాహుల్‌కు గంజాయి తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోతన ఇంటి ఆవరణలో రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. మొక్కలను స్వాధీనం చేసుకొని రాహుల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News April 24, 2025

సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం

image

కశ్మీర్ ఘటనలో మృతి చెందిన చంద్రమౌళికి ఘన నివాళి అర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్న ఆయన చంద్రమౌళికి నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, తదితరులు వీడ్కోలు పలికారు.

News April 24, 2025

SRH ఘోర ఓటమి

image

IPLలో SRH ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉప్పల్‌లో ముంబైతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 144 పరుగుల టార్గెట్‌ను ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 70 రన్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సూర్య 40*, జాక్స్ 22 రన్స్ చేశారు. ఈ ఓటమితో SRH ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు కాగా ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం.

News April 24, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించిన ఏబీవీపీ
✔NGKL: 60 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
✔కొల్లాపూర్‌లో BRS నాయకుడిపై దాడి
✔ఈత సరదా విషాదం కాకూడదు:SPలు
✔భూభారతి చట్టంపై రైతులకు అవగాహన
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✔వనపర్తి:Way2Newsతో జిహెచ్ఎం ఉమాదేవి
✔కొనసాగుతున్న ఓపెన్ SSC,INTER పరీక్షలు
✔వేసవిలో జాగ్రత్త…’Way2news’తో ఉపాధ్యాయులు
✔ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ.. విద్యార్థుల సందడి

error: Content is protected !!