News February 5, 2025
బెల్లంపల్లి: ‘కడసారి చూపుకైనా ఇంటికి రండి’
కుటుంబాలను వదిలి అడవుల్లో ఇంకా ఎంతకాలం బ్రతుకంతా వెళ్లదిస్తారు. తాను ఇంకా ఎంతోకాలం బతకనని కడసారి చూపుకైనా ఇంటికి రావాలని మావోయిస్టు నేత పుష్పతల్లి మల్లక్క వేడుకుంది. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని మావోయిస్టు సభ్యురాలు పుష్ప తల్లి జాడి మల్లక్క, సోదరుడు పోషంను CP శ్రీనివాస్ కలిసి వారిని పరామర్శించారు. మల్లక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
Similar News
News February 6, 2025
జగిత్యాల: రైతుభరోసా నిధులు విడుదల
ఒక ఎకరం వరకు ఉన్న రైతుల అకౌంట్లలో ఇవాళ రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపింది. అయితే, రైతుభరోసా కింద జగిత్యాల జిల్లాలో 84,504 మంది రైతులకు గాను రూ.35,61,20,462 విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. రైతుభరోసా నిధులను విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 6, 2025
జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేటి దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,050, గరిష్ఠ ధర రూ.6,418గా నమోదయ్యింది. అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,095, గరిష్ఠ ధర రూ.7,955గా ఉంది. మక్కలు ధర రూ.2,222గా ఉంది. ధాన్యం (1010) ధర రూ.1,655గా ఉండగా, ధాన్యం (JSR) ధర రూ.2,653గా ఉంది. ఈ వివరాలను మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
News February 6, 2025
US నుంచి భారత్కు ఫ్లైట్.. ఏ రాష్ట్రం వారు ఎందరున్నారంటే?
మన దేశానికి చెందిన కొందరిని US అక్రమ వలసదారులుగా గుర్తించి సైనిక విమానంలో తిరిగి పంపిన విషయం తెలిసిందే. టెక్సాస్ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు ఈ మధ్యాహ్నం విమానం రాగా అందులో 104 మంది భారతీయులున్నారు. వారిలో 30మంది పంజాబ్, 33మంది హరియాణా, 33మంది గుజరాత్ వాసులున్నారు. వీరితో పాటు MHకు చెందిన ముగ్గురు, UPకి చెందిన ముగ్గురు, చంఢీగఢ్ వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.