News February 5, 2025
బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో పులి సంచారం

వారం రోజులుగా పెద్దపులి సంచారం 2 మండలాల అటవీ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధి బుగ్గగూడెం అటవీ ప్రాంతం, కాసిపేట దుబ్బగూడెం, పెద్దనపల్లి ఏరియాల్లో సంచరిస్తోంది. బుధవారం బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారి పూర్ణచందర్ తెలిపారు.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదంపై మోదీ విచారం.. పరిహారం ప్రకటన

TG: మీర్జాగూడ <<18184089>>ప్రమాదంపై<<>> ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News November 3, 2025
వరంగల్ మార్కెట్‌కి వచ్చిన 7వేల మిర్చి బస్తాలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం సుమారు 7వేల మిర్చి బస్తాలు తరలివచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16, 200, వండర్ హాట్ (WH) మిర్చి రూ.15,500 పలికింది. అలాగే, తేజ మిర్చి ధర రూ.14,000, దీపిక మిర్చి రూ.14 వేలు పలికిందని వ్యాపారులు చెప్పారు.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

మీర్జాగూడ <<18183773>>బస్సు<<>> ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.


