News April 11, 2024
బెల్లంపల్లి: గంజాయి సేవిస్తూ గొడవలు.. విద్యార్థులపై ఫిర్యాదు

బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే కొంతమంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ గొడవలు చేస్తున్నారని ఇందిరమ్మ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డికి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. గంజాయి సేవిస్తూ పెద్దగా అరుస్తూ, వెకిలి చేష్టలు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం ప్రిన్సిపల్కు చూపించారు.
Similar News
News December 3, 2025
విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్కు అభినందనలు తెలిపారు.

ADB: సీఎం రేవంత్ పర్యటనపైన ప్రగతి ఆశలు

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటనతో జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. బాసర ఆలయం, కుంటాల జలపాతం, జైనథ్ టెంపుల్ అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, సమస్యలపై సీఎం స్పందిస్తే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇలా జిల్లాకి ఇంకేం కావాలో కామెంట్ చేయండి.