News April 3, 2025
బెల్లంపల్లి: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: MLA

గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లోనూ రాణించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మండలంలోని తాళ్లగురజాల గ్రామంలో నిర్వహించనున్న వాలీబాల్ పోటీల క్రీడా కిట్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రామ్ చందర్, నాయకులు రామన్న, సురేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.
Similar News
News October 19, 2025
యాదవుల సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

యాదవ సోదరుల ప్రత్యేకత వారి నమ్మకం, విశ్వాసం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన వేదిక మీద మాట్లాడారు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరులదని కొనియాడారు. యాదవుల సహకారంతోనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు సదర్, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
News October 19, 2025
దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మోర్(MS), సంత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06109 MS-SRC రైలును నేడు ఆదివారం, నం.06110 SRC-MS రైలును రేపు సోమవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు విజయవాడతో పాటు సూళ్లూరుపేట, గూడూరు, ఒంగోలు, నెల్లూరు, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News October 19, 2025
16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

గత 16 నెలల్లో ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క APలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది’ అని AUSలో తెలుగు డయాస్పోరా సమావేశంలో తెలిపారు.