News February 16, 2025
బెల్లంపల్లి: చర్లపల్లి అటవీ పరిధిలో పెద్దపులి

గత 15 రోజులుగా బెల్లంపల్లి, తాండూర్ మండల ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్దపులి తాజాగా మండలంలోని చర్లపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖాధికారి పూర్ణచంద్ర తెలిపారు. ఆదివారం ఉదయం చర్లపల్లి అటవీ ప్రాంత పరిధిలో పులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి పశువులను మేపేందుకు వెళ్ళవద్దన్నారు. గుంపులు, గుంపులుగా ఉండాలన్నారు.
Similar News
News March 15, 2026
ఓటుకు నోటు.. అసెంబ్లీలో ఫైటు: అంతా తుస్సు!

‘కారు’ దిగి ‘చేయి’ వచ్చినా కాళేశ్వరం, మూసీ కూల్చివేతలపై సభ కుదిపేయనుంది. నిధుల కొరతతో సర్కార్, ఫిరాయింపులతో విపక్షం కత్తులు నూరుతున్నాయి. బయ్యారం ఉక్కు, గిరిజన వర్సిటీ కాగితాలకే పరిమితం కాగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రిపేర్ యూనిట్‌గా మారింది. కమలం విభజన హామీలని మర్చిపోగా పతంగి, కొత్త బీసీ పార్టీలు, ఎర్రజెండా అంతా ఓటు బ్యాంకు రాజకీయంలో మునిగారు. ఇందులో అమ్మడుపోయిన ఓటర్లూ బాధ్యులే. దీనిపై మీ కామెంట్?
News March 15, 2026
ASF: జనగణనపై అధికారులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలో మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న తొలిదశ జనగణనపై కలెక్టరేట్‌లో శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, ఛార్జ్ లెవల్ ఇన్ఛార్జులకు దిశానిర్దేశం చేశారు. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్ల నియామక ప్రక్రియపై సూచనలు చేశారు. మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిత సూచించారు.
News March 15, 2026
విద్యుత్ పునరుద్ధరణకు ‘ఎమర్జెన్సీ’ వాహనాలు: ఎస్ఈ

ఖమ్మం: ప్రకృతి విపత్తులు, సాంకేతిక కారణాల వల్ల కలిగే విద్యుత్ అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు జిల్లాలో 5 ‘ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్’ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. వీటితో పాటు సబ్ డివిజన్ స్థాయిలో 13 వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. GPRS సౌకర్యం ఉన్న ఈ వాహనాల్లో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదుల కోసం 1912 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.


