News March 10, 2025

బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

image

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News December 4, 2025

అఖండ-2 ప్రీమియర్స్ రద్దు.. కారణమిదేనా?

image

వివాదాల కారణంగానే ‘అఖండ-2’ ప్రీమియర్లు <<18466572>>రద్దైనట్లు<<>> తెలుస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్‌కు 14 రీల్స్ సంస్థ రూ.28Cr చెల్లించాల్సిన వివాదం నేపథ్యంలో సినిమాను <<18465729>>ఆపాలని<<>> మద్రాసు HC ఆదేశించింది. అటు మూవీకి పనిచేసిన కొందరు టెక్నీషియన్లు కూడా తమకు వేతనాలు ఇవ్వలేదంటూ ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ కారణాలతోనే ప్రీమియర్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కానీ టెక్నికల్ గ్లిచ్ వల్లే ఆగిపోయినట్లు 14 రీల్స్ చెబుతోంది.

News December 4, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1903, కనిష్ఠ ధర రూ.1750; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2052, కనిష్ఠ ధర రూ.2005; వరి ధాన్యం (BPT) ధర రూ.2100; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3014, కనిష్ఠ ధర రూ.2651గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

News December 4, 2025

మార్స్‌పై టైమ్ 477 మైక్రోసెకండ్ల ఫాస్ట్.. ఎందుకంటే?

image

మైక్రోసెకండ్ అంటే సెకనులో మిలియన్ వంతు. మనకు ఇది లెక్కలోకి రాని వ్యవధి. కానీ సోలార్ సిస్టమ్‌లో కచ్చితమైన నావిగేషన్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ప్లాన్ చేస్తున్న స్పేస్ ఏజెన్సీలకు ఇది చాలా ముఖ్యం. భూమితో పోల్చితే అంగారకుడిపై గడియారం 477 మైక్రోసెకండ్లు వేగంగా వెళ్తుందని సైంటిస్టులు గుర్తించారు. ఐన్‌స్టీన్ జనరల్ రిలేటివిటీ థియరీ ప్రకారం బలహీనమైన గురుత్వాకర్షణ, ఆర్బిటల్ ఫ్యాక్టర్స్ దీనికి కారణమన్నారు.