News March 10, 2025
బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Similar News
News March 15, 2025
ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.
News March 15, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.
News March 15, 2025
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం డీపీఓ కార్యాలయ సమీపంలో ఆటో, యాక్టివా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యాక్టివా పైన ప్రయాణిస్తున్న ఇద్దరు 15 ఏళ్ల బాలురుల తో పాటు మరో వ్యక్తి శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది