News March 10, 2025

బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

image

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News March 16, 2025

MBNR: GET READY.. త్వరలో క్రికెట్ పండుగ!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారిగా SGF ఆధ్వర్యంలో “జాతీయస్థాయి బాలుర అండర్-19 క్రికెట్ టోర్నీ” ఏప్రిల్ 25 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టోర్నీలో సుమారుగా 40 రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. దీంతో పాలమూరుకు నూతన ఉత్సాహం నెలకొననుంది.

News March 16, 2025

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైబల్ యూనివర్శిటీ వీసీ 

image

సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్. శ్రీనివాస్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీనివాస్ శాలువాతో సన్మానించి సత్కరించారు. మొట్టమొదటి, నూతన వీసీగా నియామకమైన శ్రీనివాస్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని సూచించారు.

News March 16, 2025

అమరజీవి త్యాగం మరువలేనిది: జిల్లా ఎస్పీ

image

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా ఎస్పీ వి. రత్న తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.

error: Content is protected !!