News April 3, 2025

బెల్లంపల్లి: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ బెల్లంపల్లి కోర్టు న్యాయమూర్తి J.ముఖేష్ తీర్పునిచ్చారు. పట్టణంలోని బెల్లంపల్లిబస్తికి చెందిన MD.అమ్రాన్ అనే నిందితుడి పై S.సతీష్ రూ.10లక్షలు, K.రమేశ్ రూ.4లక్షలు చెక్ బౌన్స్ కేస్ నమోదైంది. కేసు విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో అమ్రాన్‌కు జరిమానాతో పాటు సంవత్సరం జైలు శిక్ష విధించారు.

Similar News

News April 11, 2025

ALERT: వచ్చే 3 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈ మూడు రోజులూ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News April 11, 2025

ADB: మట్కా నిర్వహిస్తున్న మహిళ.. నలుగురిపై కేసు:CI

image

ఆదిలాబాద్ ఖుర్షిద్ నగర్ లో మట్కా స్థావరం నిర్వహిస్తున్న వారిపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ రావు వివరాల ప్రకారం.. షేక్ నజ్జు అనే మహిళ కాలనీలో మట్కా నిర్వహిస్తుండగా.. హుస్సేన్, సాహిల్‌లు మట్కా ఆడటానికి రాగా వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మట్కా డబ్బులను షేక్ నజ్జు మరో నిర్వాహకుడు నజీమ్ ఉద్దీన్ అలియాస్ బబ్లుకు జమ చేస్తుందన్నారు. దీంతో బబ్లుపై సైతం కేసు చేశారు.

News April 11, 2025

సదాశివపేట రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్లాట్ బుకింగ్

image

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానానికి సదాశివపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎంపికైంది. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యానికి వెళ్లిన 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ విధానం కింద రాష్ట్రంలో 22 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట మాత్రమే ఎంపికైందని జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి తెలిపారు.

error: Content is protected !!