News April 11, 2025
బెల్లంపల్లి: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతి

బెల్లంపల్లిలోని ఆకినేపల్లి శివారులో చింతచెట్టుకు 5రోజుల క్రితం ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాళ్లగురజాల ఎస్ఐ రమేశ్ తెలిపారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్కు గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి చెందిన చేను వద్ద దుర్వాసన రావడంతో గమనించాడు. చెట్టు కొమ్మల మధ్య ఓ వ్యక్తి ఉరేసుకొని ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 3, 2025
OTTలోకి కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలు త్వరలో నెట్ఫ్లిక్స్లోకి రానున్నాయి. ఈ నెల 7 నుంచి ‘తెలుసు కదా’, 14 నుంచి ‘డ్యూడ్’ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇటీవల విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ సినిమా OTT హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. నెల రోజుల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది.
News November 3, 2025
NRPT: ‘చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి’

నారాయణపేట జిల్లాలో చేపపిల్లలు, రొయ్యల పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. పలు జిల్లాలు పంపిణీలో వెనుకబడి ఉన్నాయని, దీనిని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.
News November 3, 2025
గురుకుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: అదనపు కలెక్టర్

ప్రభుత్వ గురుకుల పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి నిష్ణాతులైన ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. వంగరలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


