News April 11, 2025
బెల్లంపల్లి: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతి

బెల్లంపల్లిలోని ఆకినేపల్లి శివారులో చింతచెట్టుకు 5రోజుల క్రితం ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాళ్లగురజాల ఎస్ఐ రమేశ్ తెలిపారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌కు గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి చెందిన చేను వద్ద దుర్వాసన రావడంతో గమనించాడు. చెట్టు కొమ్మల మధ్య ఓ వ్యక్తి ఉరేసుకొని ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 10, 2026
HYD: జిల్లా కోర్టుల జడ్జీల బదిలీలు, పోస్టింగ్

జిల్లా& సెషన్స్ కోర్టుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. సిటీ సివిల్ కోర్టు అడిషనల్ చీఫ్ సివిల్ జడ్జి 3- శ్రీనివాసరావు ఖమ్మం& సెషన్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. HYD మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి డా.మహేశ్‌నాథ్, ఖమ్మం జిల్లా ఫ్యామిలీ కోర్టు కమ్, అడిషనల్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. ఎల్బీనగర్ RR జిల్లా XII డిస్టిక్ & అడిషనల్ సెషన్స్ జడ్జిగా అనిత రానున్నారు.
News April 10, 2026
ఇండియన్ రైల్వేలో అతిపెద్ద కనెక్టింగ్ పాయింట్!

UPలోని ‘మథుర జంక్షన్’ IND రైల్వేలో అత్యంత కీలకమైన కేంద్రమనే విషయం మీకు తెలుసా? ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే 7 ప్రధాన రైలు మార్గాలు ఒకేచోట కలుస్తాయి. అందుకే రోజూ దాదాపు 190రైళ్లు ఇక్కడ ఆగుతుంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ముంబై నుంచి కోల్‌కతా వరకు దేశాన్ని ఏకం చేసే అతిపెద్ద జంక్షన్ ఇదే. ఆధ్యాత్మికంగా కృష్ణ జన్మభూమి కావడంతో పాటు, భౌగోళికంగా ఇది దేశాన్ని కలిపే ‘కనెక్టింగ్ పాయింట్’గా నిలుస్తోంది.
News April 10, 2026
పెద్దపల్లి కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని అదనపు కలెక్టర్ వేణు శుక్రవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


