News February 8, 2025
బెల్లంపల్లి: చోరీకి పాల్పడిన అనుమానితుని ఫోటో విడుదల

బెల్లంపల్లి పట్టణంలో బ్యాంకు డబ్బులు విత్ డ్రా చేసుకొని వెళుతున్న బట్వాన్పల్లి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి నుంచి నగదు చోరీ చేసిన నిందితుల అనుమానిత ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వన్ టౌన్ SHO దేవయ్య మాట్లాడుతూ.. చోరీ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. నిందితుడిని గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.
Similar News
News November 15, 2025
NZB: 17న జరిగే పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయండి

ఈనెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. శనివారం వారు 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల బకాయిల సత్వర చెల్లింపులు డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు జరిపే ధర్నా కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. శ్రీధర్, నర్సింహస్వామి, బన్సీలాల్ పాల్గొన్నారు.
News November 15, 2025
సిరిసిల్ల: స్వెటర్ల దుకాణాలు వచ్చేశాయి..!

గత వారం, పది రోజులుగా చలితీవ్రత పెరుగుతూ వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వేములవాడ, సిరిసిల్ల పట్టణాలలో కొత్తగా స్వెటర్ దుకాణాలు వెలిశాయి. నేపాల్‌కు చెందిన వ్యాపారులు వీటిని ఏర్పాటు చేశారు. నాణ్యమైన ఉన్నితో రూపొందించిన ఈ దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయని వారు అంటున్నారు.
News November 15, 2025
ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణ: శ్రీధర్ బాబు

TG: ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలదే కీలక పాత్ర అని చెప్పారు. ఇప్పటికే 25కు పైగా ‘A&D’ సంస్థలు, 1500కు పైగా MSMEలు ‘TG బ్రాండ్’ను విస్తరించాయని చెప్పారు. ₹800 CRతో JSW డిఫెన్స్ ‘UAV మాన్యుఫ్యాక్చరింగ్ UNIT’, ₹500 CRతో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ వస్తున్నాయన్నారు.


