News January 27, 2025
బెల్లంపల్లి: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

నీటి సంపులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. CI మహేందర్ కథనం ప్రకారం.. గీసుకొండ(M) శాయంపేటకు చెందిన శుభశ్రీకి బెల్లంపల్లికి చెందిన ప్రదీప్ కుమార్తో పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా గతేడాది ప్రదీప్ మృతిచెందడంతో శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. ఆదివారం ఆమె స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కుమారుడు నీటి సంపులో పడి మృతి చెంది ఉన్నాడు.
Similar News
News December 6, 2025
మీ పిల్లలు చేసే ఈ పనులను సరిదిద్దండి

పిల్లలు చేసే కొన్ని పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ అవే భవిష్యత్లో సమస్యలుగా మారే ప్రమాదముంది. పెద్దలు మాట్లాడేటప్పుడు అడ్డుకోవడం, ఏదైనా షేర్ చేసుకోకుండా మొండిగా ఉండటం, అబద్ధాలు చెప్పడం, దుకాణాల్లో మారాం చేయడం.. ఇవన్నీ చిన్న వయసులోనే మార్చాల్సిన అలవాట్లు. ఎక్కువ సమయం ఫోన్ చూడటం, మాట వినకపోవడం వంటి ప్రవర్తనలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. మృదువైన హెచ్చరికతో పిల్లలను సరిదిద్దాలి.
News December 6, 2025
విశాఖ: రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాట్లకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖలో 12 రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఖాళీ అవుతున్న 25 డ్వాక్రా మహిళలు, ఆరు PHC స్టాల్స్కు డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అందజేయాలి.
News December 6, 2025
కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.


