News January 27, 2025

బెల్లంపల్లి: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

image

నీటి సంపులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. CI మహేందర్ కథనం ప్రకారం.. గీసుకొండ(M) శాయంపేటకు చెందిన శుభశ్రీకి బెల్లంపల్లికి చెందిన ప్రదీప్ కుమార్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా గతేడాది ప్రదీప్ మృతిచెందడంతో శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. ఆదివారం ఆమె స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కుమారుడు నీటి సంపులో పడి మృతి చెంది ఉన్నాడు.

Similar News

News December 1, 2025

‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

image

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.

News December 1, 2025

అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

image

దిత్వా తుఫాను కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 10 శాతం కూడా వరి కోత అవలేదని, వరి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచి, మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసి, ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు.

News December 1, 2025

KNR: ‘హెచ్‌ఐవీ తగ్గుముఖం.. ‘జీరో’ లక్ష్యంగా కృషి’

image

దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతుందని ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను ‘జీరో’కు తీసుకురావడమే ధ్యేయమన్నారు. వ్యాధిగ్రస్తులు ధైర్యంగా మందులు వాడాలని సూచించారు. అనంతరం ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.