News January 27, 2025
బెల్లంపల్లి: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

నీటి సంపులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. CI మహేందర్ కథనం ప్రకారం.. గీసుకొండ(M) శాయంపేటకు చెందిన శుభశ్రీకి బెల్లంపల్లికి చెందిన ప్రదీప్ కుమార్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా గతేడాది ప్రదీప్ మృతిచెందడంతో శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. ఆదివారం ఆమె స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కుమారుడు నీటి సంపులో పడి మృతి చెంది ఉన్నాడు.
Similar News
News July 11, 2025
కాకినాడతో నాకు ఎంతో అనుబంధం: నటుడు సుమన్

కాకినాడ రూరల్ వలస పాకలలో సాయిబాబా గుడి వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సినీ హీరో నటుడు సుమన్ పాల్గొన్నారు. జనసేన యువ నాయకుడు పంతం సందీప్ హీరో సుమన్ ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. సుమన్ మాట్లాడుతూ.. కాకినాడ తో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.
News July 11, 2025
HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.
News July 11, 2025
KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.