News February 14, 2025

బెల్లంపల్లి: బార్‌లో దాడి.. ఆరుగురికి రిమాండ్: CI

image

బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలో ఓ బార్‌లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌషీల్, కాలం నవీన్, చింతం సాయికుమార్‌ను గురువారం రిమాండ్ తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీని 6గురు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లి సాగర్, రత్నం సోము, మామిడి అన్నమయ్యలను ఈనెల 9న అరెస్టు చేశారు.

Similar News

News December 10, 2025

NZB: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

నిజామాబాద్‌లో ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ 3పై రైలు ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. ప్లాట్‌ఫామ్, రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలై స్పాట్‌లోనే మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుందని, కుడిచేతి మధ్యవేలు లేదని గుర్తించారు. కేసు నమోదు చేశారు.

News December 10, 2025

బాపట్ల: ఇకపై భూ సమస్యలు సచివాలయంలోనే పరిష్కారం

image

నిషేధిత భూముల జాబితా నుంచి భూమి తొలగింపునకు గ్రామ/వార్డు సచివాలయంలో నామమాత్ర రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వెబ్ ల్యాండ్ సవరణలు, IGRS పేర్ల తొలగింపు, భూమి స్వభావ మార్పు, సబ్ డివిజన్ వంటి సేవలకు రూ.50 నుంచి 150 వరకు సచివాలయంలో రుసుం చెల్లిస్తే సరిపోతుందన్నారు.

News December 10, 2025

వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

image

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.