News February 10, 2025

బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్

image

బెల్లంపల్లి SRR బార్‌లో తాండూర్‌కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసిన ముగ్గురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అల్లి సాగర్, రత్నం సోమయ్య, మామిడి అన్నమయ్యలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు CIవివరించారు.

Similar News

News February 11, 2025

భువనగిరి: రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

image

అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15426043>>మృతిచెందిన<<>> మహిళను జబీన్ (40)గా పోలీసులు గుర్తించారు. మోత్కూర్ మండలం దాచారం ప్రభుత్వ పాఠశాలలో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నట్లు ఎస్సై నాగరాజు చెప్పారు. అడ్డగూడూరు పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకావడానికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

News February 11, 2025

మద్యం నుంచి TDP పెద్దలకు కమీషన్లు: YCP

image

AP: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంపై YCP ఆరోపణలు చేసింది. ‘మద్యం వ్యాపారం ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారింది. ఈ మేరకు లైసెన్సీలకు మార్జిన్ పెంచుతున్నారు. దీంతో TDP పెద్దలకు కూడా కమీషన్ పెరుగుతోంది. అంతిమంగా మద్యం రేట్లు పెరుగుతున్నాయి. ఇది మందుబాబులకు పెనుభారంగా మారనుంది’ అని ట్వీట్ చేసింది. రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్లు కాకుండా మిగతా మద్యం సీసాపై రూ.10 పెంచిన విషయం తెలిసిందే.

News February 11, 2025

కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.

error: Content is protected !!