News February 10, 2025

బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్

image

బెల్లంపల్లి SRR బార్‌లో తాండూర్‌కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసిన ముగ్గురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అల్లి సాగర్, రత్నం సోమయ్య, మామిడి అన్నమయ్యలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు CIవివరించారు.

Similar News

News March 24, 2025

ఫారంపాండ్ కుంటలకు కేరాఫ్ ఆలూరు

image

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫారంపాండ్ నీటి కుంటలకు కేరాఫ్ ఆలూరు. 2014 ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మండలంలోని పెద్దహోతూరు గ్రామం వద్ద పైలెట్ ప్రాజెక్టుగా వీటిని తవ్వించారు. వాటి ఉపయోగం గురించి అప్పట్లో రైతులకు అవగాహన సైతం కల్పించారు. ఈ ప్రాంతంలో నీటి కుంటలు విజయవంతమవడంతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కుంటల తవ్వకాలు చేపట్టారు. ఇక్కడి ఉపాధి సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీటిపై ట్రైనింగ్ ఇచ్చారు.

News March 24, 2025

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: DGP

image

AP: బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.

News March 24, 2025

యాదాద్రి: రూ.20 లక్షల స్కాలర్ షిప్

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి ఇన్‌ఛార్జి అధికారి వసంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందుతుందన్నారు.

error: Content is protected !!