News February 1, 2025

బెల్లంపల్లి: బుగ్గగూడెం నుంచి పెద్దనపల్లికి వచ్చిన పెద్దపులి

image

బెల్లంపల్లి పట్టణం స్టేషన్ ఏరియా పెద్దనపల్లి పెద్దమ్మతల్లి గుడి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం పెద్దపులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు అటవీశాఖాధికారి పూర్ణచందర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పరిసరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఏరియాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుగ్గగూడెం నుంచి పెద్దనపల్లి ఏరియాలో సంచరిస్తుందన్నారు.

Similar News

News November 1, 2025

హోంమంత్రి పనితీరును ప్రశంసించిన సీఎం

image

హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాన్‌లో మంత్రి ప్రజలకు రక్షణ సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించారన్నారు. ఈ మేరకు శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రికి ప్రశంసాపత్రం, ఉత్తమ సేవా అవార్డును సీఎం అందజేశారు. ప్రజాసేవలో సీఎం చంద్రబాబు చూపిన మార్గం తమకు ఆదర్శం అని హోంమంత్రి అన్నారు.

News November 1, 2025

బంగారం డీల్.. రూ.25 లక్షలతో పరార్..!

image

తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి రూ.25 లక్షలు కాజేసిన ఘటన నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. నరసరావుపేటకు చెందిన గణేష్‌కు శుక్రవారం కేటుగాళ్లు తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికారు. బంగారం డీల్ గురించి మాట్లాడుదామని కోటప్పకొండ వద్దకు రావాలని కోరారు.రూ.25 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

RKP: ఈ నెల 3 నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల మరమ్మత్తు పనులు: మంత్రి

image

రామకృష్ణాపూర్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల మరమ్మతులు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మరమ్మతుల్లో భాగంగా కొత్త వాటర్ ట్యాంక్ ఫిక్సేషన్, ప్లంబింగ్ కనెక్షన్లతో పాటు అవసరమైన ఇతర సామగ్రి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో ప్రజలకు అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.