News February 5, 2025
బెల్లంపల్లి: మావోయిస్టుల లేఖ కలకలం

బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని పాత గనిని ఓపెన్కాస్ట్ చేసే ప్రయత్నాలను సింగరేణి విరమించుకోవాలని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ప్రకటనలో డిమాండ్ చేశారు. OCగా మారిస్తే పరిసర గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసానికి గురవుతుందన్నారు. శాంతిఖని ఓసీ నిలిపివేసేందుకు MLA వినోద్, MPవంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలన్నారు. లేకపోతే OCలు బొందలగడ్డగా మారుతాయన్నారు.
Similar News
News September 16, 2025
వరంగల్: నేటి నుంచి ఆరోగ్య సేవలు బంద్..!

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల కింద బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో 72 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు రోగులకు అందుబాటులో ఉండవు. కావున ప్రజలు సహకరించాలని కోరారు.
News September 16, 2025
CAT-2025 దరఖాస్తుకు గడువు పొడిగింపు

CAT-2025 రిజిస్ట్రేషన్ గడువును SEP 20 వరకు పొడిగించారు. ఆసక్తిగల డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను NOV 5న విడుదల చేస్తారు. క్యాట్ -2025 ప్రవేశ పరీక్ష NOV 30వ తేదీన నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్సైట్: https://iimcat.ac.in/
News September 16, 2025
NLG: సంత.. సౌకర్యాలు లేక చింత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల్లో నిర్వహించే సంత స్థలాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్, గురజాల, అమ్మనబోలు, NKP, చింతపల్లి, కొండమల్లేపల్లి, గొడకళ్ల, త్రిపురారం, కొండమడుగు, నెమ్మికల్, తుంగతుర్తి, అర్వపల్లి, ఆత్మకూర్ (ఎం), వలిగొండ, రామన్నపేటలో సంతలు జరుగుతాయి. సంత స్థలాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.