News February 5, 2025
బెల్లంపల్లి: మావోయిస్టుల లేఖ కలకలం

బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని పాత గనిని ఓపెన్‌కాస్ట్ చేసే ప్రయత్నాలను సింగరేణి విరమించుకోవాలని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ప్రకటనలో డిమాండ్ చేశారు. OCగా మారిస్తే పరిసర గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసానికి గురవుతుందన్నారు. శాంతిఖని ఓసీ నిలిపివేసేందుకు MLA వినోద్, MPవంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలన్నారు. లేకపోతే OCలు బొందలగడ్డగా మారుతాయన్నారు.
Similar News
News February 15, 2025
నేడు ఆదిలాబాద్ జిల్లాలో వారికి సెలవు..

శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు శనివారం స్పెషల్ క్యాజువల్ సెలవు ఇస్తున్నట్ల ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. బంజారా ఉపాధ్యాయ సోదరులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
News February 15, 2025
ఆదిలాబాద్: ‘పాఠశాలల అభివృద్ధికి నిధులు సద్వినియోగం చేసుకోవాలి’

పాఠశాలల అభివృద్ధి కోసం పీఎంశ్రీ కింద మంజూరైన నిధులు సద్వినియోగం చేసుకుని పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా విద్యా శాఖ అధికారులను సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. కిచెన్ షెడ్, డార్మిటరీ, డైనింగ్ హాల్, తదితర వాటిని పరిశీలించి, పాఠశాలకు అవసరమైన మరమ్మతుల కోసం అంచనాల నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ సూచించారు.
News February 15, 2025
ADB: ‘మూల్యాంకనం విధుల నుంచి వారు తొలగింపు’

TUTF సంఘం నాయకుల ప్రాతినిధ్యం మేరకు పదో తరగతి మూల్యాంకన విధుల నుంచి అన్ని ఉపాధ్యాయ సంఘాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను తొలగిస్తూ శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఉత్తర్వులు జరిచేసినట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్ రెడ్డి పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవిని కలిసి సమస్యను విన్నవించగా విద్యాశాఖ అధికారికి తగిన చర్యలు తీసుకోమని ఆదేశించినట్లు తెలిపారు.