News November 5, 2024
బెల్లంపల్లి: ‘రాజకీయ అండతోనే భూకబ్జాకు ప్రయత్నం’
బెల్లంపల్లి పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ సంజీవని హనుమాన్ దేవాలయ భూములను పరిరక్షించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రేవల్లి రాజలింగు మాట్లాడుతూ.. దేవాలయ భూముల కబ్జాకు దౌర్జన్యంగా రాజకీయ అండతోనే కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్న దుండగులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News December 7, 2024
నిర్మల్: బాలశక్తి కార్యక్రమాన్ని నిరంతరం పకడ్బందీగా కొనసాగించాలి: కలెక్టర్
బాలశక్తి కార్యక్రమాన్ని నిరంతరం పకడ్బందీగా కొనసాగించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలశక్తి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, అన్ని రకాల పరీక్షలను నిర్వహించాలన్నారు.
News December 6, 2024
రేపటి ప్రోగ్రాంకు అందరికి ఆహ్వానం : ఆదిలాబాద్ SP
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల పాలన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. ఈనెల 7న ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్న విజయోత్సవ సంబరాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, యువత పెద్దఎత్తున హాజరై కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రోగ్రాంకు ప్రతిఒక్కరు ఆహ్వానితులేనన్నారు.
News December 4, 2024
మంచిర్యాల జిల్లాలో భూకంపం
మంచిర్యాల జిల్లాలోని పలు చోట్ల బుధవారం భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నస్పూర్, జైపూర్, చెన్నూర్ ప్రాంతాల్లో ఉదయం 7.25 గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూప్రకంపనలతో ఒక్కసారిగా ఆందోళనలు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదు.