News January 29, 2025
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 27న నిర్మల్ జిల్లాలో నిర్వహించిన జోనల్స్థాయి పోటీల్లో ప్రతిభ చూపడంతో అర్హత సాధించారు. ఏ.శ్రీహర్షవర్ధన్, డీ.విశ్వతేజ, బీ.వర్షిత్, డీ.ఆసిత్, ఎస్.సంకిత్, సాయి.బీ, రిషేంద్రవర్మ, ఎన్.రుషికేష్ ఈనెల 29 నుంచి 31 వరకు బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
Similar News
News September 17, 2025
నిజాం ఒక్కడు కాదు.. ఒక వంశం

అసఫ్ జా వంశానికి చెందిన రాజులే ఈ నిజాంలు. 1724లో హైదరాబాద్లో వీరి పాలన మొదలై, 1948 వరకు (225 ఏళ్లు) పాలించారు. నిజాం చెప్పిందే రాజ్యాం.. చేసింది చట్టం. వీరిలో నిజాం ఉల్ ముల్క్(1724-1748) మొదటివాడు. నిజాం అలీఖాన్(1762-1802), నాసిర్ ఉద్దౌలా ఫర్జుందా అలీ(1829-1857), అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్షియత్ అలీ ఖాన్(1857-1869), ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911), ఇక చివరి వాడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(1911-1949).
News September 17, 2025
నిర్మల్: స్వచ్ఛతాహి సేవ పోస్టర్ల ఆవిష్కరణ

నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య స్వచ్ఛతాహి సేవ పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తదితరులు ఉన్నారు.
News September 17, 2025
వ్యాధులు రాకుండా పరిక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

అసంక్రమిత వ్యాధులు రాకుండా మహిళలు ముందస్తుగా వైద్య పరిక్షలు చేయించుకోవాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ ప్రజలకు బుధవారం పిలుపునిచ్చారు. జిల్లాలో స్వస్థ్ నారీ.. సశక్తి పరివార్ అభియాన్ కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలందరూ తప్పని సరిగా క్యాన్సర్ స్కీనింగ్ పరిక్షలు చేయించుకోవాలన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిక్షలు చేస్తారన్నారు.