News March 14, 2025
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో 7వ తరగతికి చెందిన దుర్గం సిద్ధార్థ, దాగం శోభిత్ ఎస్‌జీఎఫ్ అండర్14 విభాగంలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
Similar News
News October 22, 2025
నేడు అన్నమయ్య జిల్లాలో స్కూల్స్‌కు సెలవు

అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కాటాబత్తిన సుబ్రహ్మణ్యం తెలిపారు. వాతావరణ శాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయా మండలాల విద్యాధికారులు పాఠశాలలకు సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News October 22, 2025
పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 22, 2025
ఖమ్మం DCC పీఠం కమ్మ సామాజిక వర్గానికేనా..?

ఖమ్మం DCC అధ్యక్ష పీఠం కోసం అంతర్గత రాజకీయం రగులుతుంది. Dy.CM భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. భట్టి వర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నూతి సత్యనారాయణ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. భట్టి వ్యూహాత్మకంగా కమ్మ వర్గం అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు సమాచారం. స్థానికత, సామాజిక సమీకరణలపై ఆధారపడి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.