News March 14, 2025

బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

image

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో 7వ తరగతికి చెందిన దుర్గం సిద్ధార్థ, దాగం శోభిత్ ఎస్‌జీఎఫ్ అండర్14 విభాగంలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

Similar News

News February 10, 2026

HYD: HCUలో కిటికీ గ్రిల్ తొలగించి ల్యాప్ టాప్ ల చోరీ

image

HCUలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ గ్రిల్ తొలగించి క్లాస్ రూమ్‌లోకి చొరబడి 50 ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. భవనంలోని వెనక కిటీకీ గ్రిల్ తొలగించడం, కారు టైర్ల గుర్తులను పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీ నలుమూలల ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనపై గచ్చిబౌలి PSలో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలరాజు తెలిపారు.

News February 10, 2026

ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు భారీగా వెచ్చిస్తున్నట్లు సమాచారం. ORR సమీపంలోని మున్సిపాలిటీలలో ఓటుకు ఏకంగా రూ.10-30వేల చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఓ అభ్యర్థి గెలిస్తే అర తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చాడు. చాలా చోట్ల ఓటుకు రూ.3-5వేల వరకు పంచడమే కాకుండా చికెన్/మటన్, మందు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

News February 10, 2026

PF విత్‌డ్రాకు ప్రత్యేక యాప్

image

UPI ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో PF సొమ్ము డిపాజిట్ అయ్యేలా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న UMANG యాప్‌నకు అదనంగా ఇది పనిచేస్తుంది. యాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే 3రోజుల్లోనే గరిష్ఠంగా ₹5లక్షల వరకు డిపాజిట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం UPI ద్వారా PF విత్‌డ్రా చేసుకునే ఫీచర్ లేదు.