News March 15, 2025
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో 7వ తరగతికి చెందిన దుర్గం సిద్ధార్థ, దాగం శోభిత్ ఎస్‌జీఎఫ్ అండర్14 విభాగంలో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
Similar News
News April 24, 2025
నిర్మల్: తల్లిదండ్రులను కోల్పోయిన ఆగని లక్ష్యం

ఖానాపూర్ మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల కళాశాల విద్యార్థిని తోకల ముత్తవ్వ అలియాస్ సుప్రియ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. BiPC ప్రథమ సంవత్సరంలో 429 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు లేకపోయినా పిన్ని, బాబాయిల సహకారంతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివినట్లు తెలిపింది. డాక్టర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంది. సరూర్నగర్లోని COEలో సీటు సాధించడంతో ప్రస్తుతం నీట్ శిక్షణ పొందుతోంది.
News April 24, 2025
సంగారెడ్డి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు: ఐజీ

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిన్నారంలో 19న కొన్ని కోతులు గుట్టపై శివుని విగ్రహం కింద పడేయడంతో ధ్వంసమైనట్లు విచారణ తేలిందన్నారు. 22న గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు వెళ్తున్న మదార్సా విద్యార్థులను చూసి కొందరు ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.
News April 24, 2025
ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

✒ 1929: ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ జననం
✒ 1934: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం
✒ 1969: జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం
✒ 1973: మాజీ క్రికెటర్ సచిన్ జననం
✒ 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది
✒ 2011: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం