News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్లోనే పులి ఆవాసం!

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News September 15, 2025
268 అర్జీలు త్వరితగతిన పరిష్కరించండి: JC

ఏలూరులోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి JC ధాత్రిరెడ్డి అర్జీలు స్వీకరించారు. 268 ఫిర్యాదులను స్వీకరించిన ఆమె బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖలకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు.
News September 15, 2025
తల్లి కాబోతున్న కత్రినా కైఫ్!

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, ఈ ఏడాది అక్టోబర్/నవంబర్లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు NDTV పేర్కొంది. లాంగ్ మెటర్నిటీ బ్రేక్లో ఉన్నారని రాసుకొచ్చింది. కత్రినా చివరిగా విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్మస్’ మూవీలో నటించారు. కాగా 2021లో విక్కీ, కత్రినా రాజస్థాన్లో వివాహం చేసుకున్నారు.
News September 15, 2025
పొన్నూరు: చిన్నారి ప్రాణం తీసిన వీధి కుక్కలు

పొన్నూరు మండలం వెల్లలూరులో విషాదం చోటుచేసుకుంది. తాడిశెట్టి కార్తీక్(5) గత నెల 22న ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించినా సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.