News August 4, 2024
బెల్లంపల్లి: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

బెల్లంపల్లి- రేచిని రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం తెల్లవారు జామున రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు 30-35 సంవత్సరాలు ఉండగా, ఒంటిపై పూల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మంచిర్యాల జీఆర్పీ ఎస్సై సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ మృతదేహాన్ని బెల్లంపల్లిలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు చేశారు.
Similar News
News September 19, 2025
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 19, 2025
క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.
News September 19, 2025
తలమడుగు: కలప అక్రమ రవాణా

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్‌లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.