News February 7, 2025

బెల్లంపల్లి: రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కన్నాల బ్రిడ్జి కింద గుర్తు తెలియని రైలు బండికి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించామని రైల్వే ASIమోహన్ రాథోడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..మృతురాలి వయసు(30) సుమారుగా ఉంటుందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

image

దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవరించిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పింది. ఆ తర్వాత బలపడి బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఈ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు లేనట్లే తెలుస్తోంది. అటు ఏపీలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నట్లు తెలిపింది.

News November 2, 2025

MBNR: రేలింగ్‌లో తలదూర్చిన బాలుడు SAFE..!

image

ఆడుకుంటూ 167 జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన రేలింగ్‌లో ఓ బాలుడు తల ఇరుక్కుని అవస్థలు పడ్డ ఘటన గండీడ్ మండలం జానంపల్లి గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వెన్నచేడ్ గ్రామానికి చెందిన నర్సింలు కుటుంబసమేతంగా మరో గ్రామానికి వెళుతున్న సమయంలో అతడి కుమారుడు శ్రీవర్ధన్ ఉన్నట్టుండి రేలింగ్‌లో తలదూర్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి తలను బయటకు తీశారు.

News November 2, 2025

NLG: నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ..!

image

శాలిగౌరారం(M) ఆకారంలో ఉన్న 800 ఏళ్ల అతి పురాతనమైన సూర్య దేవాలయం నేడు శిథిలావస్థకు చేరింది. కట్టంగూర్ నుంచి 14KM దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం గ్రామపంచాయతీ నుంచి తూర్పు దిశలో 2KM దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు పరిపాలించారని ఇక్కడ ఉన్న శిలాశాసనం తెలుపుతుంది. వీళ్లు 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం క్రితం ఈ గుడిని నిర్మించారు. ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.