News January 29, 2025
బెల్లంపల్లి: లవ్ ఫెయిల్యూర్‌తో యువకుడి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రడగంబాలబస్తీకి చెందిన వివేక్ (21) ఉరేసుకొని మృతిచెందినట్లు 2 టౌన్ ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా లవ్ ఫెయిల్యూర్ కారణంగా బాధపడుతూ దిగాలుగా ఉంటున్నాడు. రాత్రి సమయంలో తన రూములో రేకుల పైకప్పునకు చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 19, 2025
HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
News November 19, 2025
ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 19, 2025
జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.


