News January 29, 2025
బెల్లంపల్లి: లవ్ ఫెయిల్యూర్‌తో యువకుడి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రడగంబాలబస్తీకి చెందిన వివేక్ (21) ఉరేసుకొని మృతిచెందినట్లు 2 టౌన్ ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా లవ్ ఫెయిల్యూర్ కారణంగా బాధపడుతూ దిగాలుగా ఉంటున్నాడు. రాత్రి సమయంలో తన రూములో రేకుల పైకప్పునకు చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 16, 2025
GWL: పాముకాటుతో వ్యక్తి మృతి

పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాల మండలం బీరోలు గ్రామంలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ వివరాలు.. గ్రామానికి చెందిన బీచుపల్లి(47) నిన్న కృష్ణనదిలో చేపల వేటకు వెళ్లాడు. మార్గం మధ్యలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుమారుడు నరేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News February 16, 2025
నెక్స్ట్ టార్గెట్ కొడాలి, పేర్ని నానిలే: మంత్రి కొల్లు

AP: వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలుపాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ‘నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేసి వీరిని జైలుకు పంపుతాం’ అని ఆయన హెచ్చరించారు.
News February 16, 2025
తూ.గో: గుడ్డుకీ గడ్డు కాలం..భారీగా పడిపోయిన ధరలు

బర్డ్ ప్లూ దెబ్బకు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. రూ.4.90 గుడ్డు ధర రూ.4.55కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. ట్రెడర్లు బర్డ్ ప్లూ పేరుతో కొంత మేర ధర తగ్గించినట్లు చెబుతున్నారు.