News March 23, 2025
బెల్లంపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం కృషి: MLA

బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి అద్దాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమానికి కాస్మోటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందని తెలిపారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన తప్పనిసరి: మన్యం కలెక్టర్

ఎయిడ్స్ వ్యాధి నివారణపై యువత తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురంలోని కలెక్టరేట్లో సోమవారం మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలంటే నివారణ ఒక్కటే మార్గమని, వ్యాధిగ్రస్తులను చులకనగా చూడొద్దన్నారు. వ్యాధి సోకిన వారు అపోహలు మాని ఆసుపత్రులకు వెళ్లి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు.
News December 1, 2025
హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 1, 2025
HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.


