News November 21, 2024

బెల్లంపల్లి: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

బెల్లంపల్లి పట్టణంలో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, పరిసరాలు, రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం పరిశీలించారు. ఉపాధ్యాయులు విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కార్యచరణ ప్రకారంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News March 17, 2026

ADB: రెండు, మూడు రోజుల్లో శనగ కొనుగోళ్లు ప్రారంభం

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్క్‌ఫెడ్ DM ప్రవీణ్ కుమార్ తెలిపారు. క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను శుభ్రపరిచి, తేమ శాతం 14% మించకుండా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గ్రామాల వారీగా కేటాయించిన తేదీల్లోనే పంటను తేవాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 17, 2026

ఆదిలాబాద్: మే 20న భారీ జాబ్ మేళా.. 7వేల కొలువులు!

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మే 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేళా ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నా, కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని యువతకు సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.