News April 5, 2025
బెల్లంపల్లి: సమష్టి కృషితోనే లక్ష్యసాధన: GM

2924-25 ఆర్థిక సంవత్సరంలో 100% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి ఒక్క ఉద్యోగి కృషి ఉందని బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి అన్నారు. కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పాటుచేసిన అభినందన సభలో మార్చి నెలలో 100% ఉత్పత్తి సాధించి స్పెషల్ ఇంసెంటివ్ స్కీమ్‌కి అర్హత సాధించినందుకు కార్మికులందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.
Similar News
News November 7, 2025
జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.
News November 7, 2025
HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
News November 7, 2025
NRPT: నవంబర్ 14న ‘చదువుల పండగ’: కలెక్టర్

నవంబర్ 14న జిల్లా స్థాయిలో ‘చదువుల పండగ-కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం!’ అనే నినాదంతో మహా వేడుక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే ఉత్సాహం నింపే లక్ష్యంతో ఈ పండుగను నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు.


