News March 1, 2025
బెల్లంపల్లి: హత్యాయత్నం కేసులో నలుగురి రిమాండ్

2 రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ CI అబ్జలుద్దీన్ తెలిపారు. చర్లపల్లి జంకాపూర్‌కు చెందిన మహేందర్‌పై సన్నీ, బానేశ్, ఆదిత్య, సాయి కత్తితో దాడి చేశారు. మొక్క జొన్న అమ్మకానికి గుడిసే ఏర్పాటు చేయకూడదని అతడిపై దాడి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News March 27, 2025
కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లకు ఢిల్లీలో శిక్షణ

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ఆధ్వర్యంలో “నేతృత్వ సృజన్” పేరుతో మహిళా నాయకత్వ శిక్షణ తరగతులు న్యూఢిల్లీలో 2 రోజులపాటు జరిగాయి. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లి శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, తదితరులు ఉన్నారు.
News March 27, 2025
కునాల్‌కు మద్దతుగా అభిమానులు..రూ. లక్షల్లో విరాళాలు

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు తన అభిమానుల నుంచి రూ.లక్షల్లో ఆర్థిక సాయం అందుతోంది. విదేశాల నుంచి ఒక అభిమాని రూ.37,000 పంపించిన ఫోటోని ఓ అభిమాని Xలో షేర్ చేశారు. యూట్యూబ్ ‘సూపర్ థాంక్స్’ ఫీచర్ ద్వారా విరాళాలు అందజేస్తున్నారు. కునాల్‌పై కేసు నమోదైన నేపథ్యంలో లీగల్ ఖర్చుల అవసర నిమిత్తం అభిమానులు డబ్బు పంపిస్తున్నారు. DY.cm ఏక్‌నాథ్ శిండేపై కామెడీ స్కిట్ చేసినందుకు కునాల్ పై కేసు నమోదైంది.
News March 27, 2025
వనపర్తి: జాగ్రత్తలు పాటించు… వేడిని నియంత్రించు…!

జిల్లాలో రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు కింది జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.* అత్యవసరమైతేనే బయటకు రండి.* తగినంత నీరు తాగడం ద్వారా శరీరంలో నీటి లోపాన్ని నివారించండి.* వదులైన, కాటన్ దుస్తులను ధరించడం మంచిది.* చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువసేపు ఎండలో ఉండకుండా చూసుకోండి.