News February 2, 2025
బెల్లంపల్లి: 3 రోజులుగా ఆ పరిసరాల్లోనే పెద్దపులి
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు బుగ్గగూడెం పరిసర అటవీ ప్రాంతాల్లో గత 3రోజులుగా పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారి పూర్ణచందర్ తెలిపారు. పులి జాడ తెలుసుకునేందుకు 5చోట్ల కెమెరాలు అమర్చినట్లు అధికారి వివరించారు. కానీ కెమెరాల్లో పెద్దపులి చిక్కలేదని వివరించారు. కాగా ఆదివారం ఉదయం పులి తిరుగుతున్న పాదముద్రలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News February 2, 2025
భద్రాద్రి కలెక్టరేట్లో రేపు ప్రజావాణి కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
News February 2, 2025
బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస
TG: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగన్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.
News February 2, 2025
BREAKING: చరిత్ర సృష్టించిన భారత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్పై చేసిన 82/2 పవర్‌ప్లేలో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.