News February 3, 2025
బెల్లంపల్లి: 4 రోజులుగా అక్కడే పులి నివాసం!

గత 4 రోజులుగా బెంబేలెత్తిస్తున్న పెద్దపులి బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గగూడెం అటవీ ప్రాంతంలోనే తిష్ట వేసింది. సోమవారం FRO పూర్ణచందర్ మాట్లాడుతూ..బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలో పెద్దపులి కదలికలు రికార్డు అయ్యాయన్నారు. పులి స్థావరం సురక్షితంగా ఉండడంతోనే గత 4 రోజులుగా ఒకే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుగ్గ రహదారిలో ప్రజలెవరు వెళ్లకూడదని హెచ్చరించారు.
Similar News
News November 22, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అంబారిపేట విద్యార్థిని

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్లలో జరిగిన అండర్ 17 బాలికల విభాగంలో అంబారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని చింత శరణ్య అద్భుతంగా రాణించి జగిత్యాల జిల్లా ఖోఖో టీంను మొదటి స్థానంలో నిలిపింది. దీంతో ఈమె రేపటి నుంచి 25వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ జి.రాజేష్ తెలిపారు.
News November 22, 2025
iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.
News November 22, 2025
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి స్వామి వారి లడ్డూ ప్రసాదంతోపాటు స్వామి వారి ఫొటో ఆలయ అధికారులు అందజేశారు.


