News April 5, 2025

బెల్లంపల్లి: BRS నాయకుడిపై క్రిమినల్ కేస్

image

సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో బెల్లంపల్లి MLAపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపైన కేసు నమోదు చేసినట్లు తాళ్లగురజాల SI రమేశ్ తెలిపారు. MLA సహకారంతో కొందరు కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందున్న ఖాళీ స్థలం కబ్జా చేస్తున్నారని అసత్య ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపతథ్యంలో BRS నాయకుడు నూనెటి సత్యనారాయణపైన క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News April 8, 2025

బాంబులు అమర్చాం.. అక్కడికి వెళ్లొద్దు: ‘మావో’ లేఖ

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టపైకి స్థానిక ప్రజలు వెళ్లవద్దని సీపీఐ మావోయిస్టు వెంకటాపురం-వాజేడు కార్యదర్శి శాంత పేరుతో లేఖను విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి తాము కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్లు తెలిపారు. ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలు పోలీసుల మాయమాటలు నమ్మి వేట పేరుతో కర్రెగుట్టలపైకి వెళ్లొద్దని లేఖలో పేర్కొన్నారు.

News April 8, 2025

మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

image

వానాకాలం పంట కొనుగోలులో భాగంగా మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోతల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఎన్. భీమ్యా నాయక్‌తో కలిసి ప్రారంభించారు.

News April 8, 2025

NZB: అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం: కవిత

image

అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

error: Content is protected !!