News February 21, 2025
బెల్లంపల్లి: FEB 23న TG CET

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఈనెల 23 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్తో పాటు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పాయింట్ పెన్, పరీక్ష ప్యాడ్ తీసుకొని రావాలని సూచించారు.
Similar News
News October 15, 2025
HYD: ‘₹4,000 పెన్షన్ వస్తుందా!.. అందిరికీ తెల్సిందేగా’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ప్రచారం ఉపందుకుంది. మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళను ₹4,000 పెన్షన్ వస్తుందా? అని అడగ్గా ఆమె నవ్వుతూ ‘అందరికీ తెలిసిందేగా’ అని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.
News October 15, 2025
పరిగి: ‘PM కిసాన్ పేరిట మోసాలతో జాగ్రత్త’

పీఎం కిసాన్ యోజన పేరిట జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఇదే చివరి అవకాశం అంటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు నమ్మి వచ్చిన లింకులను క్లిక్ చేయొద్దన్నారు. పథకానికి అప్లై చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్, అధికారులను మాత్రమే ఆశ్రయించాలని అన్నారు.
News October 15, 2025
ఖమ్మం: మక్కల కొనుగోళ్లకు రెడీ..!

ఉమ్మడి ఖమ్మంలో మొక్కజొన్న పంటను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించనుంది. ఉమ్మడి జిల్లాలో 98,554 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 96,864, ఖమ్మంలో 1,690 ఎకరాల్లో సాగు చేశారు. భద్రాద్రిలో 20, ఖమ్మంలో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. గత ఏడాది క్వింటా మొక్కజొన్నలకు రూ.2,225 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది కేంద్రం రూ.2,400గా ప్రకటించింది.