News March 18, 2025

బెల్లంపల్లి: KU డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి: శంకర్

image

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ శంకర్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ కోఆర్డినేటర్ MD.రఫీ తెలిపారు. కళాశాలలో BA, Bcom, Bscచదువుతున్న 2వ,4వ,6వ సెమిస్టర్ విద్యార్థులు ఈ మేరకు నిర్ణయించిన ఫీజులు ఆన్ లైన్‌లో చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు కాకతీయ విశ్వవిద్యాలయం అవకాశం కల్పించిందన్నారు.

Similar News

News December 4, 2025

నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

image

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.

News December 4, 2025

ఉమ్మడి వరంగల్‌లో 130 ఏళ్ల పంచాయతీరాజ్‌ ప్రస్థానం

image

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ 130 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. HYD పంచాయతీ చట్టం నుంచి మొదలైన ఈ ప్రయాణంలో అశోక్‌ మెహతా కమిటీ సిఫార్సులు, మండల వ్యవస్థ ఏర్పాటుతో పంచాయతీలు బలోపేతం అయ్యాయి. తండాలకు పంచాయతీ హోదా లభించడంతో జీపీల సంఖ్య 567 నుంచి 1708కి పెరిగింది. ఈ వ్యవస్థ ద్వారానే అనేకమంది నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు.

News December 4, 2025

ఈ అలవాట్లతో సంతోషం, ఆరోగ్యం!

image

చిన్న చిన్న అలవాట్లే మంచి ఆరోగ్యం, సంతోషానికి కారణమవుతాయని న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ చెబుతున్నారు. ఉదయాన్నే సూర్యకాంతిలో ఉండటం, రోజువారీ నడక, మంచి నిద్ర, శ్రద్ధతో తినడం, మిమ్మల్ని కేర్ చేసే వారితో మాట్లాడటం, 2 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్, దయతో వ్యవహరించాలని తెలిపారు. రాత్రి వేళల్లో స్క్రీన్ చూడటం తగ్గించడం, హైడ్రేటేడ్‌గా ఉండటం, రోజూ కొత్తవి నేర్చుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.