News April 3, 2025
బెల్లంపల్లి: ‘SC, ST కేసుల్లో జాప్యం చేయకూడదు’

కరీంనగర్ జిల్లాలో SC, STకమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా SC, ST రివ్యూ మీటింగ్లో సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు. SC, STకేసు ఫిర్యాదులను ఎలాంటి జాప్యం లేకుండా రిజిస్టర్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల్లో SC, STలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. SC, ST హాస్టల్ విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Similar News
News November 7, 2025
కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్మెంట్ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.
News November 7, 2025
వందేమాతరం దేశభక్తిని మేల్కొలిపే శక్తి: జేసీ

వందేమాతరం నినాదం మనందరిలో దేశభక్తిని మేల్కొలిపే ఒక శక్తి అని జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు. వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఏకస్వరంతో వందేమాతర గీతాన్ని ఆలపించారు. వందేమాతరం గీతం స్వాతంత్య్ర స్ఫూర్తికి మూలం అని ఆయన తెలిపారు. ఈ గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారని గుర్తు చేశారు.
News November 7, 2025
నెల్లూరు: భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

మనుబోలు పరిధిలోని భార్య హత్య కేసులో ముద్దాయి రాపూరు శ్రీనివాసులు @ చిన్నోడుకు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018 జులై 2వ తేదీ తమ కుమార్తె ప్రేమ వివాహం విషయమై భార్య రాపూరు వెంకటరమణమ్మతో చిన్నోడికి తగాదా జరిగింది. ఆ కోపంతో నెల్లూరు నుంచి KR పురం వెళ్తుండగా మార్గమధ్యలో ఆటోను ఆపి ఆటో జాకీ రాడ్తో భార్యపై దాడి చేసి హత్య చేశాడు.


