News April 11, 2025
బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డు 3వసారి మనకే..!

GMR శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. ఇండియా అండ్ సౌత్ ఏషియా విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ 2025 అవార్డును నాలుగోసారి కంపెనీ CEO ప్రదీప్ ఫణికర్ అందుకున్నారు. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.
Similar News
News November 24, 2025
చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
త్వరలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు?(1/2)

విశాఖలోని సింహాచలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. బోర్డులో మొత్తం 20కి పైగా సభ్యులతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని వారినే బోర్డులోకి తీసుకునే వారు. అయితే ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన వారిని కూడా బోర్డులో తీసుకునే అవకాశాలున్నాయి.
News November 24, 2025
త్వరలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ?(2/2)

సింహాచలం దేవస్థానంలో అనువంశిక ధర్మకర్తను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పూసపాటి వంశస్థులనే నియమిస్తూ వస్తున్నారు. ఇంతకుముందు చైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజు ఇటీవల గోవా గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే. గవర్నర్గా చేసే వారు ఇతర స్థానాల్లో కీలక బాధ్యతల్లో ఉండరాదనే నిబంధనలు వల్ల ఆయన చైర్మన్గా కొనసాగడంపై తర్జనబర్జనలు జరిగాయి. కొత్త బోర్డు నియామకాం ద్వారా ఈ అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


