News April 11, 2025

బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ అవార్డు 3వసారి మనకే..!

image

GMR శంషాబాద్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్‌ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా విభాగంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ 2025 అవార్డును నాలుగోసారి కంపెనీ CEO ప్రదీప్‌ ఫణికర్‌ అందుకున్నారు. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.

Similar News

News April 17, 2026

వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌పై కేసు

image

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్ బాయిలర్ పేలుడు <<19650757>>ఘటన<<>>లో మృతుల సంఖ్య 20కి చేరింది. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌తో పాటు ప్లాంట్ మేనేజర్‌పై FIR నమోదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపాల వల్లే ఇంతమంది ప్రాణాలు పోయాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

News April 17, 2026

తిరుమలలో సహస్ర నామార్చన ఆంతర్యం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాలసేవ తర్వాత జరిగే ముఖ్య కైంకర్యం సహస్ర నామార్చన. ఇందులో స్వామివారిని 1008 నామాలతో పూజిస్తారు. ఈ నామాల ద్వారా శ్రీమహావిష్ణువు సకల వైభవాలను కీర్తిస్తారు. సకల దుఃఖాలను తొలగించేది, శుభాలను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే అనే భావనతో ఈ అర్చన జరుగుతుంది. భక్తులు ఆర్జితసేవ టికెట్ల ద్వారా ఈ పవిత్రమైన అర్చనలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.

News April 17, 2026

కేసీఆర్ సభకు దీటుగా మేడిగడ్డలో CM బహిరంగ సభ..?

image

జగిత్యాల KCR సభకు కౌంటర్ ఎటాక్‌గా, BRS సభకు ప్రాధాన్యత తగ్గించే విధంగా మేడిగడ్డలో CM బహిరంగ సభ ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రి శ్రీధర్ బాబు అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి, KCR తీసుకున్న నిర్ణయాలు, సాంకేతిక వైఫల్యాలను ఈ సభ ద్వారా ఎండగట్టాలని CM యోచిస్తున్నట్లు తెలుస్తోంది.