News January 24, 2025
బెహరన్‌లో రోడ్డు ప్రమాదం.. తిమ్మాపూర్ వాసి మృతి

జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కుక్కటికారి రమేష్ (47) బెహరన్ దేశంలో ఈ నెల 20న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రమేష్ కు భార్య చంద్రిక కుమారుడు, కుమార్తె ఉన్నారు, రమేష్ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం వరకు స్వగ్రామం తిమ్మాపూర్‌కు చేరుకుంటుందని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రమేష్ భార్య చంద్రిక కోరారు.
Similar News
News February 18, 2025
బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.
News February 18, 2025
కామారెడ్డి: హత్య చేశారా.. కాల్చి చంపారా

లింగంపెట్ మండలం భానాపూర్ అటవీ ప్రాంతంలో పోచయ్య(70) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. పోచయ్య స్వగ్రామం పిట్లం మండలంలోని బోలక్ పల్లి గ్రామంగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు పిట్లం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. హత్య చేసింది పరిచయస్తుడే అనే కోణంలో పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
సిద్దిపేట: ఆర్చరీలో గోల్డ్ మెడల్.. సీపీ అభినందన

ఆర్చరీ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ 2025 పోటీలలో బంగారు పతకం సాధించిన రశ్మిత రెడ్డిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన చిరుకోటి రశ్మిత రెడ్డి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్ షిప్-2025 పోటీల్లో బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయమని అన్నారు.