News February 10, 2025
బేగంపేట: సైబర్ క్రైమ్‌పై స్పెషల్ ఫోకస్

సైబరాబాద్ పోలీస్ అధికారుల బృందం సైబర్ క్రైమ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రోజురోజుకు యమగండంగా మారుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడమే దీనికి ఉన్నత మార్గంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా బేగంపేట ప్రాంతంలోని ఎయిర్‌ఫోర్స్ అధికారులకు సైతం అవగాహన కల్పించినట్లు పేర్కొంది. సైబర్ నేరాల్లో విద్యావంతులే అధిక శాతం ఉన్నట్లు పలు కేసుల విచారణలో తేలింది.
Similar News
News December 8, 2025
వాజేడు మండలంలో యాక్సిడెంట్.. ఒకరు మృతి

ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరుకూరు మీదుగా వెళ్ళుతున్న మిని టాక్సీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గొంది సాంబశివరావు (45) మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి వాజేడు ఎస్ఐ జక్కుల సతీష్ చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News December 8, 2025
CHROME వాడుతున్నారా?.. యాపిల్ హెచ్చరిక

గూగుల్ క్రోమ్ వాడే ఐఫోన్ యూజర్లను యాపిల్ సంస్థ హెచ్చరించింది. Chrome బ్రౌజర్ ‘డివైజ్ ఫింగర్‌ప్రింటింగ్’ అనే రహస్య ట్రాకింగ్ పద్ధతి ద్వారా యూజర్ల కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని పేర్కొంది. దీనిని ఆఫ్ చేసే అవకాశం యూజర్లకు లేదని తెలిపింది. అలాగే Safariలో ‘Try App’ లింక్‌లను నొక్కితే Google App ఓపెన్ అవుతోందని తద్వారా మరింత డేటాను సేకరిస్తుందని అభిప్రాయపడింది. Safari బ్రౌజర్ సేఫ్ అని స్పష్టం చేసింది.
News December 8, 2025
నెల్లూరు: విష జ్వరాలపై కలెక్టర్ అత్యవసర సమావేశం

జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల అత్యవసర సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ, GGH వైద్యులతో నిర్వహించారు. బుచ్చి, రాపూరు ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించనప్పటికీ లోపల మాత్రం దీనిపై పునరాలోచనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చినట్లు తెలిసింది.


